Saturday, December 21, 2024

ఈ డ్రామాలు కేసీఆర్ కు అలవాటే: రేవంత్

- Advertisement -
- Advertisement -

ఎన్నికల సమయంలో తెలంగాణా సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లబ్ధి పొందడం కేసీఆర్ కు అలవాటని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం అర్ధరాత్రి ఏపీ పోలీసులు భారీ సంఖ్యలో తరలివచ్చి, ఆంధ్రకు నీళ్లు విడుదల చేయాలంటూ 13వ గేటును తెరిచేందుకు ప్రయత్నించారు. దీంతో తెలంగాణ పోలీసులకు, ఆంధ్ర పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.

ఈ సంఘటనపై రేవంత్ మాట్లాడుతూ ఇలాంటి కుతంత్రాలు ఎన్నికల్లో ప్రభావం చూపవన్నారు. ఏ రాష్ట్రంతో సమస్యలు నెలకొన్నా, సామరస్యపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఆయన కొడంగల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News