Monday, December 23, 2024

పొన్నం సార్… తెలివంటే మీదే!

- Advertisement -
- Advertisement -

తెలివింటే కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ దే. పోలింగ్ రోజు నాడు ప్రచారం చేయకూడదు కాబట్టి, ఆయన తెలివిగా ప్లాన్ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన పొన్నం ప్రభాకర్… ఓటు వేయడానికి బయల్దేరే ముందు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కు పూజలు జరిపారు. సిలిండర్ కు పూల దండ వేసి, 500 రూపాయల నోటును దానిమీద పెట్టి నమస్కరించి, ఓటు వేసేందుకు కదిలారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూ. 500 కే గ్యాస్ బండ ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది జనంలోకి వెళ్లేలా, తనకు ఓటు వేయమని చెప్పకనే చెప్పేలా పొన్నం చక్కగా ప్లాన్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News