- Advertisement -
మన తెలంగాణ /సిద్దిపేట: ఓటురు లిస్టులో పేరు తొలిగించిన నేపథ్యంలో కొమురవెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. ముత్యం వెంకటేశం (35) అనే వ్యక్తి తన ఓటు తొలగించారని సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలుసున్న గ్రామ సర్పంచ్ భర్త సార్ల కిష్టయ్య సముదాయించడంతో కిందకు వచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు వినియోగించుకోకపోవడం మరణంతో సమానం అని ఆవేదన వ్యక్తం చేశారు.
- Advertisement -