Sunday, December 22, 2024

ముగిసిన పోలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సమయం ముగిసింది. పలుచోట్ల పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. ఇప్పటికే క్యూలో ఉన్న వాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. 13 నియోజకవర్గాల్లో 4 గంటలకే ఓటింగ్ ముగిసింది. డిసెంబర్ 3 తేదీన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 51.89 పోలింగ్ నమోదైంది. మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్‌ విడుదల కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌  గ‌డ‌వు స‌మ‌యాన్ని ఎన్నిక‌ల క‌మిష‌న్ స‌వ‌రించింది. గురువారం సాయంత్రం 5.30 గంట‌ల త‌ర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్ర‌సారానికి ఎన్నికల కమిషన్ అనుమ‌తించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News