Thursday, January 9, 2025

భారత్‌కు మరిన్ని యుద్ధ విమానాలు.. భారీ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత వైమానిక దళం (ఐఎఎఫ్) కోసం 97 తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ గురువారం ఆమోదం తెలిపింది. మరిన్ని యుద్ధ విమానాలు పొందేందుకు మార్గం సుమగం చేసింది. 156 ప్రచండ్ యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలుకు కూడా అనుమతించింది. వీటిలో 90 హెలికాప్టర్లు ఆర్మీకి, 66 హెలికాప్టర్లు ఐఎఎఫ్‌కు కేటాయించనున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎస్‌యూ 30 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌కు కూడా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

దేశీయంగా తయారు చేస్తున్న తేజస్ విమానాలు, ప్రచండ్ హెలికాప్టర్ల ఒప్పందం విలువ రూ.1.1 లక్షల కోట్లు అని రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్‌లో ఉపయోగించే అత్యాధునికి యుద్ధ నౌకలు భారత్‌కు చేతికి వచ్చాయి. కొచ్చి షిప్‌యార్డ్‌లో నిర్మిస్తున్న మొత్తం ఎనిమిది నౌకల్లో భాగంగా తయారైన మూడు నౌకలను గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా వైస్ అడ్మిరల్ సంజయ సింగ్ మాట్లాడుతూఏ భారత్‌కు అద్భుతమైన నౌకానిర్మాణ వ్యవస్థ ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News