Friday, December 20, 2024

ఆయర్వేదిక్ సిరప్ తాగి ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

నడియాడ్(గుజరాత్ ): గుజరాత్ లోని ఖేడా జిల్లా లోని నడియాడ్ పట్టణం లో ఆయుర్వేదిక్ సిరప్ తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈనెల 28,29 తేదీల్లో ఈ మరణాలు సంభవించాయి. ఆ సిరప్‌లో మిథైల్ ఆల్కహాల్ కలియడంతో కలుషితమైనట్టు ఖేడా పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ ఘడియా చెప్పారు. బిలోదర గ్రామానికి చెందిన ఒకషాపు యజమాని “కల్మేఘాసవ్ అసవ అరిషా’్ట అనే బ్రాండ్ కలిగిన ఆయుద్వేద టానిక్‌ను సుమారు 50 మందికి విక్రయించాడు. ఈ సిరప్ తాగిన వారిలో ఐదుగురు రెండు రోజుల్లో మరణించారు.వీరిలో నలుగురి మృతదేహాలకు ఎలాంటి కారణం తెలుసుకోకుండానే ఆయా కుటుంబీకులు అంత్యక్రియలు చేయడం జరిగిపోయింది.

ఐదో వ్యక్తి నాటు సోడా మృతదేహానికి అంత్యక్రియలు పోలీస్‌లు ఆపుచేయించి వైద్య పరీక్ష చేయించారు. దీంతో రక్తనమూనాల్లో టానిక్‌లో విషపూరితమైన మిథైల్ ఆల్కహాలు అవశేషాలు కనిపించాయి. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. పోలీస్‌లు రంగం లోకి దిగి సిరప్ అమ్మిన వ్యక్తితోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ ఆ సిరప్‌లో కలిసిందని బయటపడినట్టు పోలీస్‌లు వివరించారు. షాపు యజమాని కిషన్ సోధా ఆ సిరప్ బాటిల్స్ తానే గత వారం రోజుల్లో దాదాపు 50 మందికి విక్రయించానని ఒప్పుకున్నాడని ఎస్‌పి తెలిపారు. ఈ సిరప్ బాటిల్ ఒక్కోటి రూ. 100 కు కొనుగోలు చేసి రూ.130 కి విక్రయించినట్టు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News