Monday, December 23, 2024

దక్షిణాఫ్రికా సిరీస్‌కు టీమిండియా ఎంపిక

- Advertisement -
- Advertisement -

ముంబై: దక్షిణాఫ్రికా సిరీస్ కోసం టీమిండియాను ఎంపిక చేశారు. డిసెంబర్‌లో భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. సిరీస్‌లో భారత్ మూడు టి20లు, రెండు టెస్టులు, మరో మూడు వన్డేలు ఆడనుంది. ఇందు కోసం మూడు వేర్వేరు జట్లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. టి20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్, టెస్టులకు రోహిత్ శర్మ, వన్డేలకు కెఎల్ రాహుల్ సారథ్యం వహిస్తారు. పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు దూరంగా ఉండనున్నారు. సీనియర్ బౌలర్ షమి కూడా అందుబాటులో ఉండడం లేదు. అయితే ఈ ముగ్గురితో పాటు రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. టి20 జట్టుకు మరోసారి సూర్యకుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. వన్డేల్లో రజట్ పటిదార్, రింకు సింగ్, సాయి సుదర్శన్, సంజూ శాంసన్, రుతురాజ్ తదితరులకు చోటు లభించింది.

జట్ల వివరాలు:
టి20: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతరాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బోష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, ముకేశ్ కుమార్, దీపక్ చాహర్.
టెస్టు టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, అశ్విన్, జడేజా, శార్దూల్, సిరాజ్, ముకేశ్ కుమార్, షమి,బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.
వన్డే టీమ్: కెఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్, సాయి సుదర్శన్, తిలక్‌వర్మ, రజత్ పటిదార్, రింకు సింగ్, శ్రేయస్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్, కుల్దీప్, యజువేంద్ర చాహల్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్, దీపక్ చాహర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News