- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు జరుతున్న నేపథ్యంలో నగరంలో పండగ వాతావరణం నెలకొంది. నగర వాసులంతా ఓట్లు వేసేందుకు తమ తమ సొంత గ్రామాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. ప్రజలంతా ఓటువేయడానికి గ్రామాలకు తరలి పోవడంతో హైదరాబాద్ మహానగరం బోసిపోయింది. ముఖ్యంగా రోజు కిక్కిరిసిపోయే హైదరాబాద్ మెట్రోలో అనూహ్య పరిస్థితి నెలకొంది. గురువారం నగరంలో ప్రయాణిస్తున్న మెట్రో రైళ్ళు కరోనా కాలం నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో సుమారు 35,655 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 3.26 కోట్ల మంది ఓటర్లు గురువారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- Advertisement -