Sunday, December 22, 2024

చెన్నూరు నియోజకవర్గం భీమారంలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భీమారంలో బూత్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
గుర్తు తెలియని వాహనం తో బాల్క సుమన్ అనుచరులు నలుగురు బూత్ లోపలికి వెళ్లినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు తెలిపారు. భీమారం ఎస్సై రాజవర్ధన్ వచ్చిన వ్యక్తులకు సహకరించారాని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపణ చేశారు. ఆందోళనకు దిగిన కార్యకర్తల వద్దకు వివేక్ వెంకట స్వామి వెళ్లి సమాచారం అడిగి తెలుకున్నారు . బీమారం లోని పోలింగ్ బూత్ వద్ద ఎక్కడా కూడా సెంట్రల్ ఫోర్స్ లేదని స్టేట్ పోలీస్ తో సెక్యూరిటీ కలిపించారని, 136 బూత్ లో తమకు అన్యాయం జరిగిందని  కాంగ్రెస్ నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News