Friday, December 20, 2024

షాకింగ్ ఘటన: ఏడాది కాలంగా తల్లి మృతదేహంతో అక్కాచెల్లెళ్ల జీవనం

- Advertisement -
- Advertisement -

ఇద్దరు అక్కాచెల్లెళ్లు, తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుని జీవిస్తున్న దారుణ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసి నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ షాకింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని మదర్వా ప్రాంతంలో ఉషా త్రిపాఠి అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లు పల్లవి(27), వైశ్విక్(17)లతో కలిసి నివాసం ఉంటుంది. తన భర్తతో దూరంగా ఉంటున్న ఉషా ఓ చిన్న కిరాణషాపు నడుపుకుంటూ ఇద్దరి కూతుళ్లను చదివిస్తోంది. ఈ క్రమంలో గతేడాది ఆమె అనారోగ్యానికి గురై కొద్దిరోజులకే మరణించింది. అయితే, తల్లి చనిపోయిన విషయాన్ని ఆమె ఇద్దరు కూతుళ్లు ఎవరికీ చెప్పకుండా మృతదేహాన్ని ఇంట్లోనే దాచి పెట్టారు.

అలా ఏడాది కాలంగా తల్లి మృతదేహంతోనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు జీవనం కొనసాగించారు. అయితే, ఈనెల 29వ తేదీ బుధవారం ఉషా త్రిపాఠి సోదరుడు ఆమెను కలిసేందుకు వచ్చాడు. ఇంటి వద్దకు వెళ్లి ఎంతసేపు చూసిన తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడికి పోలీసులు చేరుకుని తలుపులు పగలగొట్టి చూడగా.. ఓ గదిలో ఉషా అస్థిపంజరం కనిపించగా.. మరో గదిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండడతో షాక్ గురయ్యారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News