Saturday, November 23, 2024

యాదాద్రి భువనగిరిలో అత్యధికంగా 90.03 శాతం పోలింగ్ నమోదు: వికాస్ రాజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 80 ఏళ్లకు పైబడిన వారికి హోంఫ్రం ఓట్ బాగా సక్సెస్ అయిందని సిఇఒ వికాస్ రాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మోడల్, ఉమెన్ స్పెషల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ పెట్టామన్నారు. తెలంగాణలో 70.74 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. 2018తో పోలిస్తే మూడు శాతం పోలింగ్ తగ్గిందని వివరించారు. జిహెచ్‌ఎంసి ఏరియాల్లో క్యూ యాప్ ప్రవేశపెట్టామని, సైలెన్స్ పిరియడ్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించామన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇవిఎంలను మార్చామన్నారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, తెలంగాణలో పురుష ఓటర్ల కంటే స్త్రీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని వికాస్ రాజ్ తెలియజేశారు.

18 నుంచి 19 వయస్సు ఓటర్లు 3.06 శాతం ఉన్నారని కొనియాడారు. మునుగోడు అత్యధికంగా 91.5 శాతం పోలింగ్ నమోదుకాగా అతల్పంగా యాకుత్‌పురలో 39.6 శాతం నమోదైందని వివరించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గతం కంటే ఎక్కువగా వచ్చాయని ఆయన వివరించారు. ఎల్లుండి 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో మూడంచెల భద్రత ఉంటుందని, ఓట్ల లెక్కింపు కోసం 1766 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశామని వికాస్ రాజ్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం, హైదరాబాద్ లో అత్యల్పంగా 46.68 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. 79 నియోజకవర్గాల్లో 75 శాతం పోలింగ్ నమోదైందని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News