- Advertisement -
అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం వరకు మిచాంగ్ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆదివారం వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తుఫాను కారణంగా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంతాల ప్రజలకు ఎపి విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. మత్సకారు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించింది.
- Advertisement -