- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 4వ తేదీన జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కానున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ) శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది.
ఆదివారం శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, ఆ మరుసటి రోజే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ మూడో శాసనసభకు గురువారం(నవంబర్ 30) ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం(డిసెంబర్ 3) ఓట్ల లెక్కింపు జరగనుంది.
- Advertisement -