- Advertisement -
హైదరాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన తరువాత ఆసీస్ ఆటగాళ్లు కప్ తీసుకొని రూమ్‌లోకి వెళ్లారు. మిచెల్ మార్ష్ మాత్రం కప్‌పై కాళ్లు పెట్టి విశ్రాంతి తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మార్ష్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడుకున్నారు. కప్ అంటే అతడికి గౌరవం లేదని విమర్శలు గుప్పించారు. పెద్ద ఎత్తున దుమారం కూడా చెలరేగింది. వరల్డ్ కప్పు కాళ్లు పెట్టడాన్ని అతడు సమర్ధించుకున్నాడు. అందులో తనకు ఏలాంటి తప్పు కనిపంచడం లేదని అతడు చెప్పారు. మళ్లీ కూడా అలా చేస్తానని స్పష్టం చేశాడు. తాను ఎక్కువగా సోషల్ మీడియాను చూడనని, అసలు పట్టించుకోనని మార్ష్ చెప్పాడు.
- Advertisement -