Friday, December 20, 2024

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈడీ అధికారి

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు లోని దిండిగల్‌లో లంచం తీసుకుంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ)కి చెందిన అధికారి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం కలకం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగినుంచి రూ.20 లక్షల వరకు లంచం తీసుకున్న నేరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారి అరెస్ట్ అయ్యారు. రాష్ట్ర నిఘా , అవినీతి నిరోధక శాఖ ఈ అరెస్టు చేసింది. శుక్రవారం మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టులో ఈ కేసు విచారణకు రావడంతో నిందితుడు అంకిత్ తివారీని డిసెంబర్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మధురై కార్యాలయం లోను, తివారీ నివాసం లోనూ శుక్రవారం నుంచి సోదాలు చేస్తున్నారు. ఈ కేసులో మధురై, చెన్నైలకు చెందిన అనేక మంది అధికారుల ప్రమేయం ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. అనేక మంది అధికారులను బెదిరించి వారి నుంచి కోట్ల రూపాయలు తివారీ కాజేశాడని, లంచాల సొమ్ము ఇతర ఈడీ అధికారులకు పంపిణీ చేసే వాడని దర్యాప్తులో బయటపడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News