Saturday, December 21, 2024

ఇటలీ ప్రధాని మెలోనీతో ఫిఎం మోడీ సెల్ఫీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దుబాయిలో జరిగిన కాప్28 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని కలిశారు. మెలోనీ కూడా ప్రధానితో సెల్ఫీ దిగిదాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ‘ మేము మంచి స్నేహితులం’అని రాశారు. అలాగే ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా ‘ మెలోడి’ అని రాశారు. ప్రధాని మోడీ సైతం ఈ సెల్ఫీని రీపోస్టు చేస్తూ ‘మంచి మిత్రులను కలుసుకోవడం ఎప్పుడూ సంతోషదాయకమే’అనే సందేశం ఉంచారు. వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ఒక రోజు పర్యటనకోసం దుబాయి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. మెలోనీతో పాటుగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, బ్రెజిల్ ప్రధాని లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా,బ్రిటన్ విదేశాంగమంత్రి డేవిడ్ కామెరూన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, కింగ్ చార్లెస్ తదితరులను కూడా ప్రధాని మోడీ కలిశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News