Sunday, November 24, 2024

ఫిలిప్పీన్స్‌ను కుదిపేసిన భూకంపం..

- Advertisement -
- Advertisement -

మిండానవో : ఫిలిప్పిన్స్‌లో శనివారం భారీ స్థాయి భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6 పాయింట్లుగా రికార్డు అయింది. భూకంప తీవ్రత పరిగణన దరిమిలా వెంటనే సునామీ హెచ్చరికలు వెలువరించారు. ఇప్పటి తీవ్రస్థాయి ప్రకంనల గురించి యూరోపియన్ మధ్యధరా భూకంప విశ్లేషణ కేంద్రం (ఇఎంఎస్‌సి) ప్రకటన వెలువరించింది. మిండానావో ప్రాంతంలో భూకంప కేంద్రం నెలకొంది. భూమి పొరల్లో 63 కిలోమీటర్ల అడుగున భూమి కంపించింది.

తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతాల పరిధిలో ఉన్న ఫిలిప్పిన్స్‌లో ఇప్పటి పరిణామంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం వివరాలు వెంటనే తెలియలేదు. కాగా దక్షిణ ఫిలిపిన్స్ , ఇండోనేసియా, పలాయూ, మలేసియాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ అలల ధాటి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఫిలిప్పిన్స్‌లోని సురిగావోడెల్ సుర్, దవావో ఓరియంటల్ ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాలని హెచ్చరికలు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News