Sunday, November 24, 2024

మా జోలికొస్తే ఊరుకునేది లేదు..

- Advertisement -
- Advertisement -

ప్యాంగ్యాంగ్ : అమెరికా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ గట్టి హెచ్చరిక సందేశాన్ని పంపాడు. మా జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఇటీవల ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. ఈ మేరకు కొరియా రక్షణ శాఖ స్పందించింది. ‘మా అంతరిక్ష ఆస్తులపై వాషింగ్టన్ దాడులకు ప్రయత్నిస్తే.. మేం ఆ దేశ నిఘా శాటిలైట్లను ధ్వంసం చేస్తాం. అలాంటి చర్యలను యుద్ధ ప్రకటనగా భావిస్తాం’ అని అమెరికాకు ఉ.కొరియా హెచ్చరికలు చేసింది.

నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కిమ్ ప్రభుత్వం గతంలో రెండుసార్లు విఫలయత్నాలు చేసింది. అయితే ఈ నెల ప్రారంభంలో రష్యా సహకారంతో శాటిలైట్ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. గతవారం ఈ ప్రయోగం జరగ్గా.. కిమ్ లాంచింగ్‌ను వీక్షించారు. ఈ ప్రయోగంతో దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాలు తమ సైన్యాన్ని అప్రమత్తం చేశాయి. అలాగే రోదసీ ప్రయోగాల ద్వారా ఎదురయ్యే ముప్పును వివిధ మార్గాల ద్వారా ఎదుర్కొంటామని ఉ.కొరియా ప్రయోగాన్ని ఉద్దేశించి అమెరికా స్పందించింది. ఈ క్రమంలోనే కిమ్ దేశం నుంచి ఈ స్పందన వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News