- Advertisement -
హైదరాబాద్: మెట్లపై నుంచి జారిపడి గాయపడిన గర్బిణీని చికిత్స నిమిత్తం తరలిస్తు అత్యవసర సమయంలో కీసర 108 సిబ్డంది నెలలు నిండకుండా పుట్టిన పసికందుకు సీపీఆర్ చేసి తిరిగి ప్రాణాపాయం నుండి కాపాడారు. దమ్మాయిగూడకు చెందిన సయ్యద్ జరీనా బేగం (23) ఆరు నెలల గర్బిణీ. శనివారం మెట్లపై నుండి జారిపడి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు కీసర 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా కడుపు నొప్పితో బాదపడుతున్న జరీనా బేగంను అంబులెన్సులో గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో నొప్పులు తీవ్రమయ్యాయి. డా.దుర్గా ప్రసాద్ సూచనల మేరకు 108 ఈఎంటీ చిత్రం రవి గర్బిణీకి అంబులెన్సులోనే సుఖ ప్రసవం చేశాడు. కీసర 108 ఈఎంటీ చిత్రం రవిని గాంధీ ఆసుపత్రి వైద్యులు అభినందించారు.
- Advertisement -