Saturday, December 21, 2024

వైన్‌ షాప్‌లు బంద్

- Advertisement -
- Advertisement -

నేటి ఉ.6గం. నుంచి రేపు ఉ. 6గం. వరకు మద్యం
దుకాణాల మూసివేత

మన తెలంగాణ/ హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు తెలంగాణ వ్యా ప్తంగా వైన్‌షాపులు మూసివేయాలని ఆదేశించింది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రేపు (సోమవారం) ఉదయం 6 గం టల వరకు రాష్ట్రంలోని మద్యం దుకాణా లు, బార్లు, క్లబ్‌లను బంద్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా 49చోట్ల ఓట్ల లెక్కింపు జరుగనుంది. నేడు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న కౌం టింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు అధికారు లు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో 15 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News