Saturday, December 21, 2024

సిద్దిపేటలో మంత్రి తన్నీరు హరీష్ రావు ఆధిక్యం …

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కొనసాగుతోంది. యాకుత్‌పురలో ఖైరతాబాద్‌లో బిజెపి అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతుండగా, మేడ్చల్‌లో కాంగ్రెస్ నేత తోటకూర వజ్రేస్ యాదవ్ ముందంజలో ఉన్నారు. అటు మక్తల్‌లో చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ముందంజలో ఉన్నారు. గజ్వేల్‌లో తొలి రౌండ్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ ముందజలో ఉన్నారు. ఇక శేరిలింగంపల్లిలో బిఆర్‌ఎస్ అభ్యర్థి గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News