రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర కొనసాగిస్తుంటే హోరాహోరి పోరాటంలో ఎంఐఎం తన సిట్టింగ్ స్థానాలను నిలుపుకునే దిశలో పయనిస్తోంది. ఏడు సిట్టింగ్ స్థానాలతో పాటు అదనంగా మరో రెండు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేసింది. అయితే 9 స్థానాలకు గాను ఏడు స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయం దిశలో పరుగు పెడుతున్నారు. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం మూడు స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు.
మరో నాలుగు స్థానాలన్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్లలో ఎంఐఎం పోటీ చేసిన పలు స్థానాల్లో గట్టి పోటీ ఎదుర్కొంది. చార్మినార్, యాఖుత్‌పరా, బహాదుర్‌పురా, కార్వాన్ స్థానాల్లో బిజెపి అభ్యర్థులు కొన్ని రౌండ్లలో ఆధిపత్యం కొనసాగించినట్లు కనిపించింది. అయితే రౌండ్లు పెరిగే కొద్ది ఎంఐఎం తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. చార్మినార్‌లో తొలివిజయం సొంతం చేసుకుంది.