Saturday, December 21, 2024

ముఖ్యమంత్రిగా రేవంత్ ?

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కలిసి కోరిన డికె శివకుమార్, రేవంత్

సిఎం రేసులో భట్టి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ఎన్నికయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సిఎల్‌పి నేత ఎంపిక కార్యక్రమం సోమవారం జరగనుంది. పిసిసి చీఫ్ రేవంత్‌తో సహా భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు సిఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసైని క లిసిన కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని  తెలిపారు.

రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణిక్‌రావు ఠా క్రే, డికె శివకుమార్ కలిసి ఆదివారం (డిసెంబర్ 3) రాత్రి 8.45 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వచ్చారు. సిఎల్‌పి నేతగా ఎంపికైన వారు నూతన సిఎంగా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీ కారం చేసే అవకాశం ఉంది. అదే విధంగా డిసెంబర్ 9న కేబి నెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసి నట్లు సమాచారం. ఆ రోజు పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు సోనియా, రాహుల్, ప్రియాం క, ఖర్గే సహా కీలక నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ ఏ ర్పాటు ప్రక్రియలో డిసెంబర్ 9కి ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యం లో ఈ తేదీని ఎంచుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 60 కాగా.. కాంగ్రెస్ 64, మిత్రపక్షమైన సిపిఐ 1 స్థానాల్లో గెలిచాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News