Monday, December 23, 2024

రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం…..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రేవంత్ రెడ్డి అంటేనే ప్రత్యర్థి పార్టీలకు భయం. రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి గెలవకుండా ఉండేందుకు వంద కోట్లు ఖర్చు చేసిన ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయి. పాలక పక్షం కొంచెం తప్పు చేసిన నిలదీయడంతో పాటు ప్రజల్లోకి తీసుకెళ్లడడంతో మొదటి వరసలో ఉండేవాడు. ప్రజా సమస్యలపై యుద్ధంలో సైనికుడిలా పోరాడేవాడు. అవినీతి, అన్యాయాన్ని ముక్కుసూటిగా ప్రశ్నించేవాడు. ప్రజా సమస్యలే ద్వేయంగా ముందడుగు వేసేవాడు. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మూడేళ్ల తరువాత అతడికి టిపిసిపి పదవి దక్కడంతో దూకుడు పెంచాడు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజలకు దగ్గరయ్యాడు.

నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లిలో అనుమల నర్మింసహ్మారెడ్డి-రామచంద్రమ్మ పుణ్య దంపతులకు 1969 నవంబర్ 8న ఆయన జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి మొదట రాజకీయ నేపథ్యం లేకపోవడంతో కింది స్థాయి నుంచి ఎదిగాడు. 2007లో రేవంత్ మొదటిగా జడ్‌పిటిసిగా గెలిచి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. పార్టీలన్నీ రేవంత్ వైపు చూడడంతో పాటు నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి అలుపు ఎరగకుండా ప్రజల కోసం పోరాటం చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అప్పటికే ఆయన ఎంఎల్‌సిగా గెలవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఉన్న అభిమానంతో ఆయన టిడిపిలో చేరారు. 2009లో ఆయన టిడిపి నుంచి పోటీ చేసి ఎంఎల్‌ఎగా గెలిచారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత 2014లో టిడిపి నుంచి ఎంఎల్‌ఎ గెలిచి టిడిఎల్‌పి ఫ్లోర్ లీడర్‌గా కొనసాగారు. టిడిపి ఆంధ్ర పార్టీ అని ముద్రపడడంతో వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేసి 2017లో కాంగ్రెస్‌లో చేరారు.   2018 అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ నుంచి రేవంత్ ఓడిపోయాడు. వెంటనే పార్లమెంటు ఎన్నికలలో మల్కాజ్‌గిరి నుంచి ఎంపిగా పోటీ చేసి విజయం సాధించారు. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్‌ను కాంగ్రెస్ పార్టీ నియమించడంతో ప్రజా సమస్యలపై పోరాడుతూ అధికార పక్షాన్ని ఇరుకులో పెట్టాడు. కెసిఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు ఆయనను ఓడించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేస్థాయికి ఎదిగారు. 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు.

శాసన మండలి ఎన్నికలలో టిడిపి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని నామినేటేడ్ ఎంఎల్‌ఎ ఎల్విస్ స్టీఫెన్‌సన్‌ను కలిశారు. స్టీఫెన్‌సన్‌కు లంచం ఇవ్వజూపి అడ్డంగా రేవంత్ బుక్కయ్యారు. ఎసిబి స్టింగ్ ఆపరేషన్ చేయడంతో అతడు దొరికిపోయాడు. ఐపిసి 120బి, 34 కింద రేవంత్‌తో పాటు సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 2015 జులై 1న రేవంత్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసు విషయంలో రేవంత్‌ను చేదు అనుభవాలు ఇప్పటికి వెంటాడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News