Monday, December 23, 2024

ఎపిలో భారీ వర్షాలు… చలి గాలులకు వణుకుతున్న ప్రజలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: బంగాళాఖాతంలో మించాగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. ఈ తుఫాన్‌లో ఎపిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, బాపట్ల నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కృష్ణా జిల్లాలో వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలు చెరువులు, కుంటుల నిండిపోయాయి. కొన్ని చెరువులు తెగిపోవడంతో అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.
తిరుమలలో వర్షాలు కురుస్తుండడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. స్వర్ణ ముఖి ఆనకట్ట వద్ద 2004 అడుగుల మేర నీట ప్రవాహం కొనసాగుతోంది. తెలంగాణ ప్రాంతాలలో కొన్ని జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News