హైదరాబాద్: సంతోషం పత్రిక అధినేత సురేశ్ కొండేటి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. ప్రతి ఏటా ఆయన సంతోషం అవార్డుల కార్యక్రమం నిర్వహించడం తెలిసిందే. రెండు దశాబ్దాలుగా ఆయన అవార్డులు ఇస్తున్నారు. అదేవిధంగా ఈసారి గోవాలో అవార్డుల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది వివాదానికి కారణమైంది. ఈ ఈవెంట్ కోసం వచ్చిన కన్నడ సినీ ప్రముఖులు తమకు అవమానం జరిగిందంటూ వార్తల్లోకి ఎక్కారు. వారిలో కొందరికి హోటల్ బిల్లులు కూడా చెల్లించలేదట. ఇందుకు వారు టాలీవుడ్ ను తప్పుపట్టారు. తెలుగు ఇండస్ట్రీపై విమర్శలు చేశారు.
దీనిపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కౌంటరిచ్చారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ సురేశ్ కొండేటి తమ కుటుంబంలోని వారెవరికీ పీఆర్ఓ కాదనీ. ఇది ఆయన సొంతంగా నిర్వహించుకున్న అవార్డుల కార్యక్రమమనీ స్పష్టం చేశారు. ఒక వ్యక్తి చేసిన తప్పుకి తెలుగు ఇండస్ట్రీని తప్పు పట్టడం భావ్యం కాదన్నారు.దీనిపై సురేశ్ కొండేటి కూడా వివరణ ఇచ్చారు. సమాచారలోపంతో నటీనటులకు ఇబ్బందులు కలిగిన మాట వాస్తవమేననీ, ఇతర పరిశ్రమలవారిని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదనీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
సురేష్ కొండేటి చేసిన తప్పులకి మా టాలీవుడ్
ఇండస్ట్రీ మొత్తాన్ని అనే అధికారం ఎవరికీ లేదు..!Allu Aravind Clarity About Suresh Kondeti Isuue | Allu Aravind | Suresh Kondeti#AlluAravind #SureshKondeti #GeethaArts #GA2Pictures #YbrantTv pic.twitter.com/rHWpxTuwyS
— Ybrant TV (@YbrantTv) December 4, 2023