మేషం – నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు.
వ్యషభం –దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. సంతానంనాకు విద్యా, ఉద్యోగాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.
మిథునం –మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శుభవార్తలు
కర్కాటకం –పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. సేవ కార్యక్రమాలలోను చురుకుగా పాల్గొంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. వస్తు కొనుగోలు.
సింహం –ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని ఆనందందా గడుపుతారు. సోదరుల నుండి ధన లాభం పొందుతారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వాహన యోగం.
కన్య –మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. రుణాలు కొంతవరకు తీరుతాయి. శుభవార్తలు.
తుల –ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.
వ్యశ్చికం –భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.
ధనుస్సు –వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వసువుల సేకరణ. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన సౌఖ్యం.
మకరం –బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వస్తు లాభం.
కుంభం –చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.
మీనం –మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు అనుకూలంగా వుండును. సోదరుల నుండి ధన, వస్తులాభాలు.