Saturday, November 23, 2024

అక్కినేని మహిళా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

అక్కినేని మహిళా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. విజయవాడలోని అక్కినేని మహిళా ఆస్పత్రి పై అంతస్తులో సోమవారం(డిసెంబర్ 4) అర్ధరాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు, వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.

వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది ఆగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. షాట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News