తెలంగాణలో కాంగ్రెస్ సిఎం అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతుంది. హైదరాబాద్ లో గెలిచిన ఎమ్మెల్యలతో సోమవారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ సమావేశం నిర్వహించి ఎవరు సిఎం కావాలనే విషయంలో అందరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వైపే ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టీ విక్రమార్కలు కూడా సిఎం పదవి కోసం పోటీ పడుతుండడంతో అధిష్టానంతో చర్చించేందుకు డికె శివకుమార్‌తో నలుగురు ఎఐసిసి పరిశీలకులు ఢీల్లీకి వెళ్లారు. మంగళవారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం సిఎం అభ్యర్థిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టీ విక్రమార్క ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సాయంత్రం వరకు కాంగ్రెస్ అధిష్టానం సిఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.