Thursday, April 17, 2025

కర్ణాటకలో విషాదం.. గోదాం కుప్పకూలి ఏడుగురు కార్మికులు మృతి

- Advertisement -
- Advertisement -

కర్ణాటకలో విషాద సంఘటన చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి విజయపురలో ఉన్న రాజ్ గురు ఇండస్ట్రీస్ లోని ఫుడ్ ప్రాసెసింగ్ స్టోరేజీ యూనిట్ కుప్పకూలడంతో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ప్రమాద సమయంలో గోదాములో 10మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా స్టోరేజీ యూనిట్ కూలిపోవడంతో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన మొక్కజొన్న బస్తాలు కార్మికులపై పడ్డాయి.

ఈ ఘటనలో ఊపిరాడక ఏడుగురు చనిపోగా.. మరో ముగ్గురిని బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. గోదాములో పనిచేస్తున్న కార్మికులందరూ బీహార్ రాష్ట్రానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News