Monday, December 23, 2024

ఇండియా కూటమి సమావేశం వాయిదా

- Advertisement -
- Advertisement -

డిసెంబర్ 17న తదుపరి భేటీ: లాలూ ప్రసాద్

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్(ఇండియా) కూటమి తదుపరి సమావేశం డిసెంబర్ 17న జరుగుతుందని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జెడి) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం బుధవారం జరగవలసి ఉన్న ఇండియా కూటమి సమావేశం వాయిదాపడింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమావేశానికి హాజరు కాలేమని చెప్పడంతో బుధవారం నాటి సమావేశం వాయిదాపడింది.

మిచాంగ్ దుపాను కారణంగా చెన్నై విమానాశ్రయం మూతపడడంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీకి రాలేని పరిస్థితి ఏర్పడింది. అనారోగ్య కారణాల వల్ల నితీశ్‌కుమార్, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ సమావేశంలో పాల్గొనలేమని చెప్పారని వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత బుధవారం ఇండియా కూటమి సమావేశం జరగవలసి ఉంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ మినహాయించి మిగిలిన మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓటమిపాలైంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోగా మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకున్న బిజెపి ఆ రెండు రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కించుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News