Saturday, November 23, 2024

పాత అలవాట్లు త్వరగా పోవు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రతిపక్షాలు తమపై చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎక్స్(పూర్వ ట్విట్టర్) వేదికగా మంగళవారం ప్రధాని స్పందించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో మాత్రమే విజయాన్ని సాధించిన కాంగ్రెస్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పరాజయం చెందింది. ఈ మూడు రాష్ట్రాలలో బిజెపి విజాయన్ని సాధించింది. తమ పరాజయానికి ప్రతిపక్షాలు చెబుతున్న కారణాలను పేర్కొంటూ ఒక టీవీ చానల్ ప్రసారం చేసిన వార్తాకథనాన్ని ప్రధాని మోడీ ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తమ(ప్రతిపక్ష కాంగ్రెస్) అహంకారం, అసత్యాలు, నిరాశావాదం, అజ్ఞానం పట్ల వారు ఆనందంగానే ఉండవచ్చని మోడీ వ్యాఖ్యానించారు. వారి విచ్ఛిన్నకర విధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను హెచ్చరించారు. 70 ఏళ్ల పాత అలవాట్లు అంత త్వరగా వదిలిపోవంటూ ఆయన పరోక్షంగా కాంగ్రెస్‌కు చురకలు వేశారు. రానున్న రోజుల్లో ప్రతిపక్షాలు చవిచూసే మరిన్న్ని పరాజయాలను ప్రజలు చూడనున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా..ప్రధాని మోడీ సోషల్ మీడియాలో న్యూస్ క్లిప్‌పై ఇంత ఘాటుగా స్పందించడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. రానున్న రోజుల్లో సోషల్ మీడియా వేదికగా ప్రధానితోపాటు బిజెపిసైతం ప్రతిపక్షాలను చీల్చిచెండాడే అవకాశం ఉందని బిజెపి నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News