Friday, December 20, 2024

కృష్ణా జలాల పంచాయతీ 8కి వాయిదా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్యన తలెత్తిన కృష్ణానదీజలాల సమస్యను పరిష్కరించేందుకు ఈ నెల 6న నిర్వహించ తలపెట్టిన కీలక సమావేశం వాయిదా పడింది. మిగ్ జాం తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న కారణంగా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు కేంద్ర జల్‌శక్తి శాఖ వెల్లడించింది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కృష్ణానదీయాజమాన్య బోర్డు అధికారులు పాల్గొనాల్సిన ఈ సమవేశంలో శ్రీశైలం , నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావించింది. అయితే తెలుగురాష్ట్రాల్లో తుపాన్ ప్రభావం వల్ల అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైనందువల్ల సమావేశాన్ని ఈ నెల 8న నిర్వహించే అవకాశం ఉన్నట్టు కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News