Saturday, December 21, 2024

సెన్సెక్స్ @69,000

- Advertisement -
- Advertisement -

20,800 పాయింట్లు దాటిన నిఫ్టీ
రెండో రోజూ మార్కెట్లు జంప్

ముంబై : వరుసగా రెండో రోజు స్టాక్‌మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎనర్జీ స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్ల కారణంగా మార్కెట్‌లోని రెండు ప్రధాన సూచీలు చారిత్రక గరిష్టాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ తొలిసారిగా 69,000 మార్క్‌ను అధిగమించడంలో విజయం సాధించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 431 పాయింట్ల లాభంతో 69,296 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 20,855 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఎనర్జీ అత్యధికంగా 981 పాయింట్లు లేదా 3.24 శాతం పెరుగుదలతో ముగిసింది. దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ ధర 47,000 దాటడం ద్వారా చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇతర రంగాల్లో ఆటో, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టార్ల షేర్లు భారీగా ముగిశాయి. అయితే హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసిజి, ఐటి, మీడియా, రియల్ ఎస్టేట్ షేర్లు డౌన్ అయ్యాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు బుల్లిష్‌గా ఉన్నాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 19 లాభాల్లో, 11 నష్టాలతో ముగిశాయి.

రూ.3 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
స్టాక్ మార్కెట్‌లో బుల్లిష్ ట్రెండ్ కారణంగా ట్రేడింగ్‌లో బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.346.51 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత సెషన్‌లో రూ.343.45 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఒక్క రోజు ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.3.06 లక్షల కోట్లు పెరిగింది. మార్కెట్లో ప్రధానంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ 17 శాతం, అదానీ పోర్ట్ 15.30 శాతం, ఎసిసి 8.19 శాతం, అంబుజా సిమెంట్స్ 7.27 శాతం, ఎబిబి ఇండియా 4.66 శాతం వృద్ధితో ముగిశాయి. పడిపోయిన వాటిలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 3.36 శాతం పతనంతో ముగిసింది, ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ 2.74 శాతం పడిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News