Friday, December 20, 2024

భారత్ శుభారంభం

- Advertisement -
- Advertisement -

జూనియర్ హాకీ ప్రపంచకప్

కౌలాలంపూర్: జూనియర్ ప్రపంచకప్ హాకీలో భారత్ శుభారంభం చేసింది. మలేసియా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్ ఆరంభ మ్యాచ్‌లో 42 గోల్స్ తేడాతో కొరియాను ఓడించింది. అరైజీత్ సింగ్ హుందాల్ హ్యాట్రిక్‌తో భారత్ విజయంలో కీల పాత్ర పోషించాడు. ఆరంభం నుంచే హుందాల్ చెలరేగి ఆడాడు. హ్యాట్రిక్స్ గోల్స్‌తో జట్టును గెలిపించాడు. మైదానంలో పాదరసంలా కదిలిన హుందాల్ ప్రత్యర్థి జట్టు గోల్ పోస్ట్‌పై వరుస దాడులతో హడలెత్తించాడు. 11వ నిమిషంలో హుందాల్ తొలి గోల్ అందించాడు.

పెనాల్టీ కార్న్‌ర్‌ను గోల్‌గా మలచడంలో హుందాల్ సఫలమయ్యాడు.ఆ వెంటనే 16వ నిమిషంలో రెండో గోల్‌ను నమోదు చేశాడు. ఈసారి కళ్లు చెదిరే ఫీల్డ్ గోల్ సాధించాడు. దీంతో భారత్ 20 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు అనుదీప్ 30వ నిమిషంలో భారత్‌కు మూడో గోల్ సాధించి పెట్టాడు. ప్రథమార్ధంలో భారత్ 30 ఆధిక్యంలో నిలిచింది. అయితే ద్వితీయార్ధంలో కొరియా కాస్త మెరుగైన ఆటను కనబరిచింది. 38వ నిమిషంలో దోహ్యున్ లిమ్ కొరియాకు తొలి గోల్ సాధించి పెట్టాడు. అయితే భారత్ తరఫున 41వ నిమిషంలో అరైజీత్ అద్భుత ఫీల్డ్ గోల్‌ను సాధించాడు.

45వ నిమిషంలో మింక్వాన్ కిమ్ కొరియా తరఫున రెండో గోల్‌ను నమోదు చేశాడు. కాగా, చివరి వరకు నిలకైడన ఆటను కనబరిచిన భారత్ 42 తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇదిలావుంటే ఈ టోర్నమెంట్‌లో భారత్ భారీ ఆశలతో బరిలోకి దిగింది. కిందటిసారి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న యువ జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీ సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో భారత్ పూల్‌సిలో చోటు దక్కించుకుంది. భారత్‌తో పాటు కొరియా, కెనడా, స్పెయిన్‌లు ఈ పూల్‌లో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News