Friday, November 22, 2024

శంషాబాద్‌ ఎయిర్ పోర్టు నుంచి 20 విమాన సర్వీసులు రద్దు

- Advertisement -
- Advertisement -

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పాడిన వాయుగుండం మిగ్‌జాం తుపాన్ మారిన విషయం తెలిసిందే. తుపాన్ కారణంగా శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 20 విదేశీ విమాన సర్వీసులను అధికారుల రద్దు చేశారు.

తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఎపి రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఏపీలో భారీగా పంట నష్టం జరిగింది. దీంతో ఏపీ ప్రభుత్వం అధికారులను అప్రమత్తమైన చేసింది. ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక కార్యక్రమాలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించింది. తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News