Saturday, December 21, 2024

రేవంత్ రెడ్డి సిఎం కావడంపై వర్మ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

నిత్యం వివాదాలతో ప్రయాణం సాగించే రామ్ గోపాల్ వర్మ.. తనకు నచ్చినది, తన మనసులో ఏముందో బహిరంగంగానే చెప్పేస్తాడు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత మరింత రెచ్చిపోతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి సీఎం అవుతార‌ని ఆర్జీవీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఇంటికి పంపించారు. హస్తం పార్టీకి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి నాయకత్వానికి జేజేలు పలుకుతూ తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ దాదాపు అన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా విజయ దుందుభి మోగించింది. 119 అసెంబ్లీ స్థానాలకు గానూ 64 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సిఎం కుర్చీలో ఎవరు కూర్చుంటారు? దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం అధికారిక ప్రకటన చేసింది. దీంతో రేవంత్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ లిస్టులో ఆర్జీవీ కూడా ఉన్నట్లు తాజా ట్వీట్ స్పష్టం చేస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డిని రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కొనియాడారు. ఎంతో జ్ఞానం, శక్తి ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణకు ముఖ్యమంత్రిని చేశారన్న వర్మ.. ఆయన ఎనర్జీ లెవెల్స్, ఆలోచనలు తెలిసిన వ్యక్తి అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఉత్తమ ముఖ్యమంత్రి అవుతారనడంలో సందేహం లేదన్నారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేయడంతో రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. గతంలో రేవంత్ రెడ్డిపై వర్మ చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. అందులో.. హాయ్ రాహుల్ గాంధీజీ, సోనియా గాంధీజీ.. చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అపారమైన గౌరవం. ఎందుకంటే తెలంగాణకు రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారని వర్మ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News