Friday, December 20, 2024

ఆందోళన వద్దు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/మర్కుక్:ఆందోళన చెందొద్దని మన ప్రభుత్వం మళ్లీ ఏర్పాటు అవుతుందని మాజీ సిఎం కెసిఆర్ అ న్నారు. బుధవారం మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని మా జీ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ క్షేత్రానికి 540 మంది చిం తమడక గ్రామ ప్రజలు దాదాపు 10 బస్సుల్లో, 18 కారుల్లో కెసిఆర్ వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చిన కెసిఆర్ ప్రజలకు అభివాదం చేశారు. కెసిఆర్‌ను చూడగానే వారంతా జయ జయ ద్వానాలు చేశారు. వారిలో గూడుకట్టుకున్న అభిమానం ఒక్కసారిగా పెల్లుబికింది. కెసిఆర్‌ను చూసిన వారి అభిమానం కట్టలు తెంచుకుంది. పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ముందుకురికారు. చింతమడక గ్రామస్థులను చూసి కెసిఆర్ భావోద్వేనగానికి లోనయ్యారు. సిఎం కెసిఆర్…జై తెలంగాణ..జై కెసిఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

వారికి అధినేత కెసిఆర్ అభివాదం చేశారు. శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బిఆర్‌ఎస్ ఓటమి కారణంగా ముఖ్యమంత్రి పదవికి కెసిఆర్ రాజీనామా చేసిన దానికి చింతిస్తూ సంఘీభావం తెలపటానికి వచ్చినట్టు గ్రామస్థులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కెసిఆర్ సేవలు అమూల్యం అంటూ చింతమడక గ్రామస్థులు కొనియాడారు. మా వంతుగా మేము బిఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని గ్రామస్థులు తెలిపారు. అనంతరం గ్రామ అభివృద్ధి విషయాలను కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందొద్దు, మళ్లీ మన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బిఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News