ఎన్నో పోరాటాల తర్వాత, త్యాగాల పునాదులపై ఏర్పాడిన రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ఈ ఎన్నికల్లో ఎన్నో త్యాగాలు చేసీ, కాంగ్రెస్ జెండాను భుజాలు కాయలు కాసేలా మోసిన కార్యకర్తలకు, ప్రజల తెలంగాణ కోసం పోరాడిన నిరుద్యోగ యువత, ఉద్యమకారులు, మేధావులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇన్నేండ్లు ప్రజలు మౌనంగా కష్టాలను భరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందరిమ్మ రాజ్యం వచ్చింది.
ప్రగతి భవన్ చుట్టూ నిర్మించిన కంచెలను బద్దలుకొట్టించాం. తెలంగాణ ప్రజలకు ఈరోజు స్వేచ్ఛ వచ్చింది. కాంగ్సెస్ పార్టీ సవిధగా మారి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రగతి భవన్ కు ఎప్పుడు రావాలన్నా నా తెలంగాణ ప్రజలు రావొచ్చు. రేపు ఉదయం జ్యోతిరావుపూలే ప్రజాభవన్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం. సంక్షేమ, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతా.మేం పాలకులం కాదు.. మీ సేవకులం. మీ బిడ్డగా, సోదరుడిగా మీ బాధ్యతలను నిర్వహిస్తా” అని పేర్కొన్నారు.