Saturday, December 21, 2024

మంత్రిగా తుమ్మల రికార్డ్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. 1953 నవంబరు 15న జన్మించిన ఈయన 1982లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1983లో టిడిపి అభ్యర్థిగా సత్తుపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. 1985, 1994,1999లో శాసనసభకు ఎన్నికయ్యారు.

సత్తుపల్లి నుంచి నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1995, 1996 లో మరోసారి చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 1999లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేశారు. 2001లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. 2014లో బిఆర్‌ఎస్‌లో చేరారు. 2015లో ఎంఎల్‌సిగా ఎన్నికై మంత్రిగా పని చేశారు. 2016లో పాలేరు నుంచి అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

కెసిఆర్ కేబినెట్‌లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. 2023లో కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కెసిఆర్, రేవంత్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా తుమ్మల పని చేసిన రికార్డు సొంతే చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News