Monday, December 23, 2024

సోనియాకు పాదాభివందనం చేసి, ఆశీర్వాదాలు తీసుకున్న సిఎం రేవంత్ దంపతులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఫైలుపైనే సిఎంగా ఆయన తొలి సంతకం చేశారు. మరోవైపు ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే వేదికపై ఉన్న సోనియా గాంధీకి, ఇతర పెద్దలకు రేవంత్ రెడ్డి తన భార్య గీత, కూతురు, అల్లుడిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ దంపతులు సోనియా గాంధీకి పాదాభివందనం చేసి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. రేవంత్ భార్యకు సోనియా షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందనలు తెలియజేశారు.

Revanth Family

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News