Monday, December 23, 2024

చైనా మాజీ విదేశాంగ మంత్రిది హత్యా, ఆత్మహత్యా ?

- Advertisement -
- Advertisement -

మిలిటరీ ఆసుపత్రిలో అనుమానాస్పద మృతి

న్యూఢిల్లీ: ఈ ఏడాది జులైలో పదవీచ్యుతుడైన చైనా మాజీ విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ మృతిని అనుమానాస్పదంగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆయనది ఆత్మహత్య లేక చిత్రహింసల కారణంగా సంభవించిన మరణంగా అధికారులు అనుమానిస్తున్నట్లు చైనా మీడియా కథనాలు వెల్లడించాయి. బీజింగ్‌లోని ఒక సైనిక ఆసుపత్రిలో కిన్ గాంగ్ గత జులై చివరిలో మరణించినట్లు చైనా ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్న వర్గాలను ఉటంకిస్తూ పొలిటికో అనే పత్రిక పేర్కొంది. ఆ సైనిక ఆసుపత్రిలో దేశంలోని అగ్రనాయకులకు మాత్రమే వైద్య చికిత్సలు నిర్వహిస్తారు.

కాగా.. అమెరికాలో రాయబారిగా ఉన్న కాలంలో కిన్ గాంగ్‌కు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ గతంలో ఒక కథనాన్ని ప్రచురించింది. చైనా జాతీయ భద్రత విషయంలో కిన్ రాజీ పడ్డారా అన్న అంశంపై చైనా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తునకు కిన్ పూర్తిగా సహకరిస్తున్నట్లు కూడా ఆ పత్రిక పేర్కొంది. అమెరికాలో చైనా రాయబారిగా పనిచేసిన కాలంలో కిన్ పూర్తికాలం ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించారని చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన అంతర్గత దర్యాప్తులో వెల్లడైనట్లు సీనియర్ అధికారులను ఉటంకిస్తూ పత్రిక తెలిపింది.

అమెరికాలో ఆ మహిళ ద్వారా కిన్ ఒక బిడ్డకు తండ్రి కూడా అయినట్లు పత్రిక వెల్లడించింది. ఆ తర్వాత చైనా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరునెలల్లోనే కిన్ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఒక నెల రోజులపాటు అదృశ్యమయ్యారు. ఆయన విధులకు గైర్హాజరు కావడంతో ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి సీనియర్ దౌత్యవేత్త వాంగ్ ఈని చైనా ప్రభుత్వం నియమించింది. 2021 జులై నుంచి ఈ ఏడాది జనవరి వరకు వాషింగ్టన్‌లో చైనాకు చెంది అత్యున్నత రాయబారిగా కిన్ కొనసాగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News