Friday, November 22, 2024

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇంజినీర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ (ఎంఇఎస్) కు చెందిన అధికారి 1.60 లక్షల లంచం తీసుకుంటూ సిబిఐకి పట్టుబడ్డాడు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయడానికి రూ.1.60 లక్షల లంచం అడగడంతో సిబిఐ అధికారులు గురువారం వల పన్ని పట్టుకోగలిగారు. అసిస్టెంట్ గారిజన్ ఇంజినీర్ ( కాంట్రాక్ట్)నరేంద్ర కుమార్ రాజ్ రాజస్థాన్ కోటలో ఎంఇఎస్ గారిజన్ ఇంజినీర్ కార్యాలయానికి నియమింప బడ్డాడు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయడానికి, అంతకుముందు టెండర్లను పొడిగించడానికి రూ.1.60 లక్షలు డిమాండ్ చేశాడని కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశాడు. దీనిపై సిబిఐ అధికారులు వలపన్ని పట్టుకోగలిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News