Monday, December 23, 2024

మృత్యులోనూ వీడని స్నేహబంధం

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : నాలుగు డబ్బులు సంపాదించి గౌరవంగా బతుకుదామని ఉపాధి కోసం విదేశానికి వెళ్లిన ఇద్దరు స్నేహితులు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించి విగతజీవులయి వచ్చారు. ఈ హృదయవిధారక ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కల్వారాల్ లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కల్వారాల్ గ్రామానికి చెందిన అంగూరి ప్రశాంత్, గుర్రపు రవి అనే ఇద్దరు యువకులు బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లారు. అక్కడ సెలవు రోజు ప్రశాంత్,రవి మరికొందరితో కలసి కారులో పర్యాట ప్రాంతానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా వెనుక నుండి మరోకారు వాళ్లు ప్రయాణిస్తున్న కారును వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు కారు వెనుక సీటులో కూర్చున్న ప్రశాంత్,రవి ల తలలకు బలమైన గాయాలై మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఘటన సమాచారం తెలుసుకున్న రెండు కుటుంబాలు కన్నీరుమున్నీరయ్యారు.

ఉపాధి కోసం బయట దేశానికి వెళ్లి తమ పిల్లలు అనంత లోకాలకు వెళ్లిన విషయం జీర్నించుకోలేక తల్లడిల్లిపోయారు. కొన్నేళ్లు కష్టపడి డబ్బులు సంపాధించి పెళ్లి చేసుకుంటామని చెప్పి వెళ్లి శాశ్వితంగా రాకుండా పోయారంటూ ఆ కుటుంబాలు రోదిస్తున్న తీరు అందరిని కలచివేసింది. ఉపాధి కోసం వెళ్లిన ఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో బందుమిత్రులు, గ్రామస్థులు కంటతడి పెట్టారు. డిసెంబర్ 3 రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రశాంత్, రవి ల మృతదేహాలు గురువారం స్వగ్రామానికి చేరుకోగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇద్దరు యువకుల మరణంతో గ్రామంలో విశాధఛాయలు అలుముకున్నాయి. మాజి వైస్ ఎంపిపి నోముల రూపెందర్‌రెడ్డి తోపాటు పలువురు నాయకులు,గ్రామస్థులు యువకులు మృతిపట్ల సంతాపం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News