Friday, December 20, 2024

బుల్లెట్ ట్రైన్ తొలిస్టేషన్ వీడియో

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో తొట్టతొలి బుల్లెటు ట్రైన్ స్టేషన్ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం విడుదల చేశారు. అహ్మదాబాద్‌లోని సబర్మతీ మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు హబ్‌లో ఈ ట్రైన్ టర్మినల్‌ను నిర్మించారు. ఈ వీడియోను మంత్రి తమ వ్యక్తిగత సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రవేశపెట్టారు. ఈ రైలు స్టేషన్‌ను అత్యంత అద్భుతమైన నిర్మాణ చాతుర్యంతో తీర్చిదిద్దారు. ఆధునికత, సాంస్కృతికత కలవోసుకుని దీనిని రూపొందించినట్లు మంత్రి వివరించారు. త్వరలో ప్రారంభమయ్యే బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌గా ఈ టర్మినల్ పనిచేస్తుంది. అహ్మదాబాద్, ముంబైల మధ్య ఈ రైలు నడుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News