Saturday, December 21, 2024

బైక్ అదుపు తప్పి కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

వట్‌పల్లి : బైక్ అదుపు తప్పి కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఖాది రాబాద్ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగిందని వట్‌పల్లి ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఖాదిరాబాద్‌కి చెందిన పుట్ల లక్ష్మణ్ సంగారెడ్డిలో స్పెషల్ పార్టీ విభాగం లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా బుధవారం విధులు ముగించుకుని స్వగ్రామం ఖాదిరాబాద్‌లో తన తల్లిని చూడడానికి సాయంత్రం వస్తుండగా మార్గమధ్యలో బైక్ అదుపు తప్పి పడిపోవడంతో తలకు తీవ్రగాయలయ్యాయి. గ్రామస్తులు జోగిపేట దవాఖానాకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిని భార్య రమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కోటెశ్వర్ రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News