Friday, December 20, 2024

43 బంతుల్లో 193 పరుగులు!

- Advertisement -
- Advertisement -

పొట్టి ఫార్మాట్ క్రికెట్లో బాదుడే ప్రధానం. ఎన్ని బంతుల్లో ఎన్ని పరుగులు చేశామన్నదే ముఖ్యం. ఇలా టీ-20 క్రికెట్లో సూర్యకుమార్, మాక్స్ వెల్ వంటి క్రికెటర్లు చెలరేగిపోవడం చూస్తూనే ఉన్నాం. ఈ ఫార్మాట్ ను మరింత కుదిస్తూ టీ-10 ఫార్మాట్ ఒకటి తయారైంది. దీనికి క్రమేణా ప్రాచుర్యం లభిస్తోంది. కేవలం ఒక ఇన్నింగ్స్ లో పదే ఓవర్లు… అరవై బంతులే ఉంటాయన్నమాట. అంటే, బ్యాటర్ వచ్చీరాగానే ఇక పరుగుల వరద పారించడమే.

తాజాగా ఈ ఫార్మాట్ లో జరిగిన యురోపియన్ టీ-10 లీగ్ మ్యాచ్ లో ఓ బ్యాటర్ విధ్వంసం సృష్టించాడు. సోహల్ హాస్పిటిల్టెట్ , కాటలున్యా జాగ్వార్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో కాటలున్యా జాగ్వార్ జట్టు బ్యాటర్ సలీమ్ దార్ చెలరేగిపోయాడు. 43 బంతుల్లో 22 సిక్సర్లు, 14 ఫోర్లతో 193 పరుగులు చేసి, నాటౌట్  గా నిలిచాడు. దీంతో ఆ జట్టు పది ఓవర్లలో 256 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన సోహల్ హాస్పిటిల్టెట్ జట్టు ఎనిమిది వికెట్లు నష్టపోయి 104 పరుగులు మాత్రమే చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News