Wednesday, April 2, 2025

రాజ్యసభ సమావేశం సమయంలో మార్పులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ షెడ్యూల్ మేరకు భోజన విరామం అనంతరం రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంలకు బదులుగా మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశమవుతుందని రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ శుక్రవారం ప్రకటించారు. శుక్రవారం ఉదయం రాజ్యసభ సమావేశమైన వెంటనే డిఎంకె సభ్యుడు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తమకు ఇచ్చిన ఈ రోజు సభా కార్యకలాపాల షెడ్యూల్‌లో భోజన విరామానంతరం ప్రారంభమయ్యే సమావేశం సమయంలో మార్పు గురించి ప్రశ్నించారు. సభ సంప్రదాయం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామానంతరం సభ 2.30 గంటలకు ప్రారంహవుతోందని, కాని తమకు అందిన షెడ్యూల్‌లో మధ్యాహ్నం 2 గంటలని ఉందని శివ చెప్పారు. సభ్యులకు తెలియకుండా ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయన చైర్మన్‌ను ప్రశ్నించారు.

ఈ మార్పు ఎందుకు జరిగిందో ఆయన తెలుసుకోగోరారు. దీనికి చైర్మన్ ధన్‌ఖర్ జవాబిస్తూ..లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమవుతుంది కాబట్టి గత సమావేశాల్లోనే తాను ఈ మార్పు చేశానని చెప్పారు. ఇది ఈ రోజుకోసం మాత్రమే తీసుకున్న మార్పు కాదని, తానే గత సమావేశాల్లో ఈ మార్పు చేశానని ఆయన తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభ రెండూ పార్లమెంట్‌లో అంతర్భాగాలైన కారణంగా రెండింటి సమయాలలో సారూప్యత ఉండాలని ఆయన చెప్పారు. కాగా..మరో డిఎంకె సభ్యుడు ఎంఎం అబ్దుల్లా జోక్యం చేసుకుంటూ శుక్రవారం ముస్లిం సభ్యులు ప్రార్థనల కోసం భోజన విరామం అనంతరం సభ తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యేలా గతంలో నిర్ణయించారని ఆయన గుర్తు చేశారు. దీనికి చైర్మన్ స్పందిస్తూ ఉభయ సభల్లోనూ సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన సభ్యులు ఉన్నారని, లోక్‌సభలో జరిగిన మార్పునకు అనుగుణంగా తాను కూడా ఈ మార్పు చేతీసుకువచ్చానని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News