Friday, December 20, 2024

పోలీసు స్టేషన్‌కు వెళ్లిన మహిళ.. తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో పాస్‌పోర్టు వెరిఫికేషన్ కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఓ మహిళపై సబ్ ఇన్‌స్పెక్టర్ పొరబాటున తలపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ మహిళ అక్కడిక్కడే కుప్పకూలింది. సిసి టీవీలో రికార్డయిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక మహిళ పాస్‌పోర్టు వెరిఫికేషన్ కోసం అలీగఢ్‌లోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్ ఐ మనోజ్ శర్మ ముందు నిలుచుంది.

ఈ లోగా ఓ పోలీసు అధికారి ఆ ఎస్‌ఐకి పిస్టల్ ఇచ్చాడు. పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా అది పేలి తూటా ఆ మహిళ తలకు తగిలింది. దీంతో ఆ మహిళ అక్కడే కుప్పకూలింది. గాయపడిన మహిళను వెంటనే చికిత్స కోసం జెఎన్ మెడికల్ కాలేజి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు స్టేషన్‌లోని సిసి టీవీలో రికార్డయిన ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News