Monday, December 23, 2024

విద్యుత్ , సిఈఐజి అధికారుల సమన్వయ లోపం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సంవత్సరానికి 20 నుంచ 30 వరకు చిన్నా పెద్దా వరకు జరిగే ప్రమాదాలన్నీ షార్ట్‌సర్యూట్ కారణంగానే జరుగుతున్నాయి. వీటిపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించకుండా ఒకటి రెండు మాత్రమే షార్ట్ సర్యూట్ కారణంగానే జరుగుతున్నాయని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 మీటర్ల కన్నా ఎత్తుగల అపార్లుమెంట్‌లలో 75 కిలోవాట్స్ కన్నా అధిక లోడ్‌తో విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటే వాటికి సిఈఐజి అధికారులు విద్యుత్ పరికరాల నాణ్యత , పనితీరును పరిశీలించి దృవీకరించాలి. అప్పుడే సదరు భవనాలకు, షాపింగ్ మాల్స్‌కు అనుమతులు ఇస్తారు. ఇవే కాకుండా కమర్షియల్ భవనాలు, షాపింగ్ మాల్స్, హెచ్‌టి కనెక్షన్స్ వంటి వాటిని సిఈఐజి అధికారులు వాటి నాణ్యతను పరిశీలించి దృవీకరణ పత్రం విద్యుత్ అధికారులు వాటికి విద్యుత్ సరఫర చేస్తారు. సిఈఐజీ అధికారులు దృవీకరణ పత్రం ఇవ్వక పోతే విద్యుత్ సరఫరాను నిలిపివేయాలనే నిబందన ఉంది. అయితే. ఈ విషయంలో సిఐఈజీ అధికారులు పట్టించు కోవడం లేదని, మరి కొంత మంది విద్యుత్ వినియోగదారులకు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అడ్డదారుల్లో విద్యుత్ కనెక్షన్లు పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

విద్యుత్‌శాఖ, సిఈఐజి శాఖల మద్య సమన్వయం లేక పోవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రెండు శాఖల మధ్య సమన్వయం ఉంటే నకిలీ సర్టిఫికెట్ల అవకాశం ఉండదు. ఈ విషయంలో రెండు శాఖలు నిర్లక్ష్యం చేయడంతో నకిలీ సర్టిఫికెట్లు పెద్ద మొత్తంలో వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవ విద్యుత్ తనిఖీ (సిఈఐజి) అధికారులు,అపార్టుమెంట్లు ,పరిశ్రమలు, వాణిజ్య భవనాల్లో విద్యుత్ వైరింగ్ ఏర్పాటు చేసిన విధానం, అందులో ఉపయోగించిన విద్యుత్ పరికారాల, నాణ్యత, వైరింగ్ నాణ్యత వాటి సామర్ధం వినియోగించే లోడ్ ఆధారంగా పరిశీలించే దృవీకరణ పత్రం అందిస్తే ప్రమాదాలు తగ్గేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.అయితే అధికారులు సిబ్బంది లేరనే సాకుతో తూతూ మంత్రంగా తనిఖీలు చేసి ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న విధానంపై విమర్శలు వస్తున్నాయి. కొన్ని సందర్భల్లో ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం,ఆస్తి నష్టం, జరుగుతుంది . అయినా ప్రమాదాలకు షార్ట్ సర్యూట్ కాదని అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.

కొన్ని నెలల క్రింతం సికింద్రాబాద్ రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూంలోజరిగి ప్రమాదానికి షార్ట్ సర్యూట్ కాదని అధికారులు ముందుగానే చెప్పి చేతులు దులుపుకున్నారు. అయితే భవనం పై భాగంలో నిర్వహిస్తున్న హోటల్ కోసం హెచ్‌టి కనెక్షన్ తీసుకున్నారు. దీనికి నాలుగు సంవత్సరాల క్రితం సిఈఐజి దృవీకరణ పత్రం తీసుకున్నట్లు సమాచారం. నగరంలో వేల సంఖ్యలో ఇటువంటి హెచ్‌టి సర్వీసులకు దృవీకరణ పత్రం పొందడం లేదు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్కూట్ క కారణం కాదని, చెప్పిన అధికారులు దాన్ని సీజ్ చేశారు. షార్ట్ సర్కూట్ కాదని చెప్పినప్పుడు సీలు వేయాల్సిన అవసరంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ నాణ్యత విషంయలో, నకిలీ సర్టిఫికెట్ల విషయంలో అధికారులు అప్రమత్తం కాకపోతే మరింత ప్రమాదం ముంచుకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిబ్బంది కొరత పేరుతో నిర్లక్ష్యం చేస్తే ప్రజల ధన, ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. ఇకనైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News